కర్లపాలెం మండలం దమ్మన్నవారిపాలెం గ్రామ సంపద సృష్టి కేంద్రంలో బుధవారం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీపీవో కె. ఎల్. ప్రభాకరరావు మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర, స్వచ్చంద్ర పథకాలపై క్లియర్ అవగాహన కలిగి ఉండటం ద్వారా గ్రామీణాభివృద్ధిలో భాగస్వాములై ప్రజల శ్రేయస్సుకు పనిచేయగలరన్నారు. మండలానికి చెందిన 8 గ్రామ పంచాయతీల క్లాప్ మిత్రలు, సెక్రటరీలు, కార్యదర్శులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.