బాపట్లలో ఆంధ్రరత్న గోపాలకృష్ణయ్యకు నివాళి

52చూసినవారు
బాపట్ల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య విగ్రహానికి మంగళవారం ఫోరం ఫర్ బెటర్ బాపట్ల సభ్యులు నివాళులర్పించారు. చీరాల–పేరాల ఉద్యమ నాయకుడిగా, బాపట్లకు గౌరవం తెచ్చిన మహనీయుడిగా గోపాలకృష్ణయ్య సేవలు చిరస్మరణీయమని ఇంచార్జ్ డిప్యూటీ తహసీల్దారు సీతాభవాని అన్నారు. భావితరాలు స్ఫూర్తి పొందేలా విగ్రహాలను నిలుపుతూ, వర్ధంతులు నిర్వహిస్తున్న ఫోరం సేవలు ప్రశంసనీయం అన్నారు.

సంబంధిత పోస్ట్