వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం కోనేటి నగర్‌కు చెందిన నందిని (27) కుటుంబ కలహాలతో శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై జనార్ధన్ జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఐటీ కోర్ సహాయంతో ఆమెను గుర్తించి, కాలువలో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా కాపాడారు. ఆమెకు భరోసా ఇచ్చి, సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పోలీసుల స్పందనపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.