హెల్మెట్ ధరించటం వలన ప్రాణాపాయం నివారించవచ్చు: డిఎస్పి

85చూసినవారు
హెల్మెట్ ధరించటం వలన ప్రాణాపాయం నివారించవచ్చు: డిఎస్పి
కర్లపాలెం ఐలాండ్ సెంటర్ లో మంగళవారం హెల్మెట్ వినియోగం పై అవగాహన సదస్సు జరిగింది. డిఎస్పి రామాంజనేయులు, సీఐ హరికృష్ణ, కర్లపాలెం ఎస్సై రవీంద్ర లు పాల్గొని మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించుటవలన మిమ్మల్ని మీరు రక్షించుకోవటమే కాకుండా మీ కుటుంబాలను కూడా కాపాడుకున్న వారవుతారని తెలియజేశారు. హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను వివరించారు. అదేవిధంగా ప్రతి ఒక్క వాహనదారుడు లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్