బాపట్ల పట్టణంలోని ఏరియా వైద్యశాల వద్ద శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం ర్యాలీ జరిగింది. వైద్యశాల సూపరింటెండెంట్ కే. వరలక్ష్మి పాల్గొని రక్తదానం చేయడం వలన నిర్జీవమవుతున్న మనిషికి జీవాన్ని అందించటమేనని అన్నారు. ప్రతి వ్యక్తి రక్తదానం చేయాలని దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను ర్యాలీలో వివరించారు. ఈ కార్యక్రమంలో పేర్లి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, ఏరియా వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.