వైసీపీ ప్రభుత్వంలో పేదల బియ్యాన్ని అమ్ముకొని కోట్లకు పడగ
లెత్తిన బియ్యం బకాసురులందరి బండారం త్వరలోనే బట్టబయలు కానుందని, చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం చిలకలూరిపేట కార్యాలయంలో మాట్లాడుతూ పేదల
బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకున్న వ్యక్తులు ఏ స్థాయి వారై
నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పింఛన్ల పెంపుతో పేదల మొహంలో కూటమి ప్రభుత్వం ఆనందం నింపిందన్నారు.