చిల‌క‌లూరిపేట: అసాంఘీక కార్య‌క్ర‌మాల‌పై ఉక్కుపాదం

81చూసినవారు
చిల‌క‌లూరిపేట: అసాంఘీక కార్య‌క్ర‌మాల‌పై ఉక్కుపాదం
చిల‌క‌లూరిపేట పట్టణ ప‌రిధిలో పేకాట‌, త‌దిత‌ర జూదాల‌కు పాల్ప‌డే వారిపై చ‌ట్ట ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అర్బన్ సి. ఐ పి. రమేష్ స్ప‌ష్టం చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప్ర‌తి వార్డు లోనూ నిరంత‌ర నిఘా కొన‌సాగుతుంద‌ని, పేకాట, జూదం ఆడినా, నిర్వ‌హించినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. గంజాయి, త‌దిత‌ర మ‌త్తు ప‌దార్ధాల‌ను సేవించిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

సంబంధిత పోస్ట్