చిలకలూరిపేట పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, మురుగు కాలవలపై అక్రమ కట్టడాలతో మురుగు ముందుకు కదలటం లేదని కమిషనర్ శ్రీహరిబాబు అన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో కమిషనర్ ఆదివారం పర్యటించారు. కాలువలలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు తీసి మురుగు పారుదల సక్రమంగా జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తెలిపారు. కాలువలపై అక్రమ కట్టడాలు కట్టకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.