సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలకు చంద్రబాబు నాయుడు పేదలకు వరం అన్నారు. పేదలకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వ అండగా ఉంటుందంటూ ఆయన అన్నారు.