కూటమి ప్రభుత్వం ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్ అన్నారు. ఆదివారం చిలకలూరిపేట పట్టణంలోని ఎన్నారై సెంటర్లోని గల సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు విద్యను వ్యాపారంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. పేద, బడుగు, బలహీన వర్గాల చెందిన విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు.