మాజీ మంత్రి విడదల రజిని ఎన్హెచ్ఎర్సీ (NHRC)తో పాటు హెచ్ఆర్సి (HRC)ని గురువారం ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియా మరియు ప్రముఖ మీడియా ద్వారా టోల్స్ జరుగుతున్నాయన, వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఆమెతో పాటు పార్టీ అధినేత జగన్, ఆయన కుటుంబం, మాజీ మంత్రి రోజాను కూడా ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు చేసిన దూషణలు, వ్యక్తిత్వ హననంపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సోషల్ మీడియా హ్యాండిల్స్పై చర్యలు తీసుకోవాలన్నారు.