ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన శక్తి యాప్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చిలకలూరిపేట అర్బన్ సీఐ పి. రమేశ్ గురువారం కోరారు. యాప్ లో ఎన్రోల్ అయితే ఆపద సమయంలో ఉపయోగపడుతుందన్నారు. మహిళల భద్రత కోసం సీఎం చంద్రబాబు శక్తి యాప్ ప్రవేశపెట్టారని చెప్పారు. మహిళలు, విద్యార్థులు స్మార్ట్ ఫోన్ లో శక్తి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు.