పురుగుమందు తాగి వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాదెండ్ల మండలం అమీన్సా హెబ్పాలెంలో శనివారం చోటుచేసుకుంది. నాదెండ్ల ఎస్సై పుల్లారావు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన గోరంట్ల సామ్రాజ్యం (80) అనారోగ్యంతో బాధపడేది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.