చిలకలూరిపేట నియోజకవర్గంలో రహదారులు వెంట ఆక్రమణలను తొలగించాలని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. శుక్రవారం చిలకలూరిపేట మున్సిపల్ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. డ్రైనేజీలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని వెంటనే తొలగించాలని సూచించారు. డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగు పరచాలని పట్టణంలో ఎక్కడ మురుగునీరు నిలువలు లేకుండా చూడాలన్నారు.