వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి విడదల రజిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. నాయకులను, కార్యకర్తలను కలుపుకుని పోతూ చిలకలూరిపేటలో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని రజినీకి సూచించినట్లు సమాచారం.