ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిలకలూరిపేటలోని పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలు, పిల్లులకు ఉచితంగా యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ అందించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు మాట్లాడుతూ ఈ ఉచిత టీకా కార్యక్రమంలో భాగంగా మొత్తం 120 పెంపుడు జంతువులకు రేబీస్ వ్యాక్సిన్ వేయడం జరిగిందని తెలిపారు.