చిలకలూరిపేటలోని ఎన్నార్టీ సెంటర్‌లో ఉన్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఇంటింటికీ బిగించడాన్ని తక్షణమే ఆపాలని, అలాగే సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.