చిలకలూరిపేట: తక్కువ వడ్డీకి రుణాలు: ఎమ్మెల్యే

66చూసినవారు
చిలకలూరిపేట: తక్కువ వడ్డీకి రుణాలు: ఎమ్మెల్యే
పీఎం గ్రామీణ ఆవాస్ యోజన పథకంలో ఇళ్లు నిర్మించుకుని చిరు వ్యాపారాలతో ఉపాధి పొందాలనుకునే గ్రామీణ ప్రాంతాల వారికి బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తాయని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం చిలకలూరిపేట లో ఆయన స్వయం ఉపాధి చిరు వ్యాపారాల నిమిత్తం బ్యాంకు నుంచి మంజూరైన రూ. 16లక్షల రుణాలను 10మంది లబ్ధిదారులకు ఆయన అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్