చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి

10చూసినవారు
చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
చిలకలూరిపేట-గుంటూరు హైవేలోని ఈనాడు కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లాల్‌పురానికి చెందిన లారీ డ్రైవర్ శ్రీకాంత్ దుర్మరణం పాలయ్యాడు. ద్విచక్ర వాహనంపై వచ్చిన శ్రీకాంత్, రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్‌ను గమనించక బలంగా ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు శనివారం వెల్లడించారు.

సంబంధిత పోస్ట్