చిలకలూరిపేట మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలను నిబంధనలకు విరుద్ధంగా విలీనం చేశారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీ సమావేశంలో బుధవారం అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పసుమర్రు, ఎం. వి. పాలెం, గణపవరం గ్రామస్తులు విలీనాన్ని ఏకపక్షంగా తిరస్కరించారన్నారు. అమృత్ పథకం తొలి దశలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనుల్ని అమృత్-2లో పూర్తి చేయాలన్నారు. నారాయణ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మున్సిపాలిటీలు గాడిలో పడ్డాయన్నారు