అనారోగ్య సమస్యలతో బాధపడే పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సాయం వరంలా ఆదుకుంటోందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. దీర్ఘకాలిక రోగాలు, వ్యాధులతో బాధపడుతున్న 32 మంది వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబసభ్యులకు శనివారం ప్రత్తిపాటి తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందచేశారు. రూ. 27.76 లక్షల చెక్కులు వైద్యసేవల నిమిత్తం ఒకరికి 1.75 లక్షల విలువైన ఎల్.ఓ.సీని స్వయంగా బాధితులకు అందించారు.