పల్నాడు జిల్లా చిలకలూరిపేట, ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి మాట్లాడుతూ, చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి నిధులు విడుదల చేయించినట్లు తెలిపారు.