చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలోని కంపోస్టు యార్డును శనివారం ఎస్. ఈ దాసరి శ్రీనివాసరావు, ఆర్డిఎస్ హరికృష్ణ, ఈఈ వెంకటేశ్వర్లు, పబ్లిక్ హెల్త్ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబులు పరిశీలించారు. ఈ పరిశీలనలో యార్డు నిర్వహణ, వ్యర్థాల శుద్ధి ప్రక్రియ, పారిశుద్ధ్య పనులు తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. యార్డులో జరుగుతున్న పనుల పురోగతిని, వాటి నాణ్యతను అడిగి తెలుసుకున్నారు.