చిలకలూరిపేట: ఏ. పీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏకలవ్యుని జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి వర్యులు, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఆదివారం పట్టణములోని నరసరావుపేట సెంటర్లో గల రైతు బజార్ వద్ద గల ఏకలవ్యుడి విగ్రహాన్నికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రిబ్బన్ కట్ చేసి మహా అన్నదాన కార్యక్రమాని ప్రారంభించారు.