చిలకలూరిపేటలోని కోల్డ్ స్టోరేజ్ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేరళ నుంచి ఒరిస్సాకు వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది.