చిలకలూరిపేట: నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదాలు: భానుప్రసాద్

72చూసినవారు
చిలకలూరిపేట: నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదాలు: భానుప్రసాద్
నిర్లక్ష్యం, అలసత్వం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజా మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ మాదాసు భానుప్రసాద్ అన్నారు. చిలకలూరిపేటలో ఆయన బుధవారం మాట్లాడుతూ. నిన్న జరిగిన వినుకొండ ప్రమాదంలో నలుగురు మృతి చెందడంతో రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. డ్రంక్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ల డ్రైవింగ్ను నియంత్రిస్తే ప్రమాదాలు తగ్గుతాయని, అధికారులు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్