చిలకలూరిపేట: అసైన్డ్ భూములపై అక్రమాలపై కఠిన చర్యలు
By kalintha ramanjaneyulu 64చూసినవారుచిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామ పరిధిలోని వాగు పోరంబోకు, అసైన్డ్ భూముల్లో అక్రమంగా కొనుగోలు, విక్రయాలు చేయవద్దని తహసీల్దార్ మహ్మద్ హుస్సేన్ సోమవారం హెచ్చరించారు. అసైన్డ్ భూముల్లో ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ భూముల్లో గ్రానైట్ తవ్వకాలు, దొంగ పట్టాలపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.