చిలకలూరిపేట వాసి, రాధాకృష్ణ జ్యువెలరీ మార్ట్ అధినేత కొల్లా శ్రీరామమూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గురువారం వాసవినగర్ లోని ఆయన స్వగృహానికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు కూడా పాల్గొన్నారు.