స్నేహం, సేవా అనే దృక్పథంతో ఇన్నర్‌వీల్ క్లబ్ పని చేస్తుందని క్లబ్ అధ్యక్షురాలు గట్టు సరోజిని అన్నారు. ఇన్నర్‌వీల్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో పట్టణంలోని సుగాలీ కాలనీలో నివాసం ఉండే కోటమ్మబాయి అనే దివ్యాంగురాలికి శుక్రవారం ట్రైసైకిల్ అందజేశారు. స్థానిక స్వాతి జ్యువలర్స్ అధినేత కొత్తూరి సూర్య నారాయణ అందించిన ఆర్థిక సహాయంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు గట్టు సరోజిని తెలిపారు.