కూటమి ప్రభుత్వంపై పథకాల అమలుపై పని కట్టుకొని మరి వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని చిలకలూరిపేట పట్టణంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఆ పార్టీ పేటీఎం బృందానికి ఒక వ్యసనంలా మారిందని పద్ధతి మార్చుకోకుండా వికృతానందం పొందుతూ వారు చేసే విష ప్రచారానికి వారు తగిన మూల్యం చెల్లించుకోవాలన్నారు. బ్యాంకుల్లో తల్లికి వందనం డబ్బులు పడలేదంటూ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారంటే తెలిపారు.