టీటీడీ పై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అసత్యమని, అవి తాడేపల్లి ఆదేశాలతోనే రాష్ట్రంలో మత విద్వేషాలు రేపేందుకు చేస్తున్న కుట్రలో భాగమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. చిలకలూరిపేటలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ గోశాలలో గోవుల మరణాలపై చేసిన ప్రచారం పూర్తిగా అబద్ధమని అన్నారు. ఎక్కడో మరణించిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు ముడిపెట్టారన్నారు.