యడ్లపాడు మండలం బోయపాలెంలో ఇద్దరు కార్మికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. శుక్రవారం యడ్లపాడు పోలీసులు కధనం మేరకు. ఓ స్పిన్నింగ్ మిల్లులో ఒరిస్సాకు చెందిన ఇద్దరు కార్మికుల మధ్య వ్యక్తిగత కారణాలతో ఘర్షణ చెలరేగింది. కార్మికుల్లో ఒకరైనా కులదీప్ జగన్నాథ్(35) కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయాలైన జగన్నాథ్ ను గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఘర్షణ ప్రాంతాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.