చిలకలూరిపేట రూరల్ సెక్షన్‌లో 19 గ్రామాల్లో గురువారం విద్యుత్ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 150 అనధికారిక సర్వీసులను గుర్తించి రూ. 6 లక్షల జరిమానా విధించారు. అదనంగా 4 సర్వీసులకు రూ. 1. 2 లక్షలు, మరో సర్వీసుకు బిల్లింగ్ లో తేడాతో రూ. 30, 000 జరిమానా విధించారు. అధికారులు విద్యుత్ దొంగతనం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.