5 వేల జనాభా దాటిన మేజర్ పంచాయతీలలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు త్రీ ఫేస్ విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసే పథకం యొక్క పురోగతిని విద్యుత్ అధికారులతో శుక్రవారం శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సమీక్షించారు. చిలకలూరిపేట మండలంలోని పసుమర్తి, మురికిపూడి, యడ్లపాడు మండలం తిమ్మాపురం, నాదెండ్ల మండలం సాతులూరు, నాదెండ్ల, గణపవరం వంటి మేజర్ పంచాయతీలు సదరు పథకంలో చేర్చబడ్డాయని అన్నారు.