రాయితీపై పేదలకు నిత్యవసర సరుకులు అందించటమే ప్రభుత్వ లక్ష్యమని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు చెప్పారు. గురువారం చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన రాయితీ నిత్యవసర సరుకులు ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన ధరలతో పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.