చిలకలూరిపేట పట్టణంలోని భావనరుషి నగర్‌లో ఉన్న ఓ టిఫిన్ సెంటర్‌లో బుధవారం గ్యాస్ లీక్ కావడంతో సిలిండర్ పేలి భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అక్కడున్న ఆరుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పూర్తిస్థాయిలో ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.