స్వచ్చ చిలకలూరిపేటలో భాగంగా 100శాతం పాలిథిన్ కవర్ల నిషేదానికి ప్రజలు, వ్యాపార వర్గాల వారు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు చెప్పారు. బుధవారం చిలకలూరిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్చా ఆంధ్ర-స్వర్ణాంద్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడోవ శనివారాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.