నాదెండ్ల మండల ఎంపీడీవో కార్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీ వారు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులు, సొసైటీ సభ్యులతో మాట్లాడిన ఆయన, రక్తదాన ఆవశ్యకతపై యువతకు అవగాహన కల్పించాలని చెప్పారు. రక్తదానాన్ని జీవితంలో కచ్చితంగా చేపట్టాల్సిన ఒక మంచి కార్యక్రమంగా నేటి యువత భావించేలా వారిలో చైతన్యం తీసుకురావాలని ప్రత్తిపాటి నిర్వాహకులకు సూచించారు.