ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నాదెండ్ల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలోని ప్రజలు అర్జీలు ఇవ్వటానికి మండల పరిషత్ కార్యాలయానికి తరలి వచ్చారు. తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు.