మాజీ మంత్రి విడదల రజినీ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని చిలకలూరిపేటలో పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. సీఐ సుబ్బనాయుడు మాజీ మంత్రి కారును అడ్డుకున్నారు. కారు లోపల ఉన్న శ్రీకాంత్ రెడ్డిని సీఐ పట్టుకొని బయటికి లాగారు. తన అనుమతి లేకుండా కారులోకి వెళ్లటానికి విడదల రజినీ అభ్యంతరం తెలపండంతో ఆమెను పక్కకి నెట్టివేశారు. పలు కేసుల్లో శ్రీకాంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడని పోలీసుల అరెస్ట్ చేశారు.