చిలకలూరిపేట పట్టణానికి చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు షేక్ జాఫర్ విద్య, సామాజిక, సేవా రంగాలలో చేసిన కృషికి గాను జాతీయ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జాఫర్ను దుస్సాలువతో సత్కరించారు. ఈ అవార్డు జాఫర్ యొక్క విద్యా రంగంలో అంకితభావం, సమాజ సేవలో నిబద్ధతకు గుర్తింపు లభించిందన్నారు.