చిలకలూరిపేటలో విద్యుత్ లైన్లు మరమ్మతులు కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని సోమవారం అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు వాసవి నగర్, పోలీస్ స్టేషన్ రోడ్డు, ఎంవి. నారాయణపురం, చౌత్రా సెంటర్, ఆర్యవైశ్య మండపం రోడ్డు, ఎమ్మెల్యే కాంప్ ఆఫీస్ రోడ్ లో విద్యుత్ నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని ఏడీఈ కోరారు.