నాదెండ్ల మండలంలోని సాతులూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నూతన గ్రామ కమిటీకి ఎంపికైన సభ్యులు గురువారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిశారు. అధ్యక్షులుగా నార్నె కోటయ్య స్వామి, ప్రధాన కార్యదర్శిగా కోట మహేష్ బాధ్యతలు చేపట్టగా, ప్రత్తిపాటి వారిని ఘనంగా సత్కరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.