రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక సమయంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సామాన్యులు పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇచ్చినా న్యాయం జరగటం లేదన్నారు. రాష్ట్రంలో సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం రివ్యూ చేపట్టడం లేదన్నారు.