యడ్లపాడు మండల కేంద్రమైన వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు ప్రక్కన శుక్రవారం ఆగిప్రమాదం చోటుచేసుకొన్నది. మంటలు ఇళ్ళవద్దకు చేరుకోవడంతో ఇళ్ల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈలోగా దట్టమైన పొగ, సెగలతో జాతీయ రహదారిపై ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందికి గురైనారు. సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన టీమ్ లీడర్ వెంకయ్య, సిబ్బంది అగ్నిమాపక వాహనంతో ప్రమాదస్థలం వద్దకు వచ్చి మంటలను అదుపు చేశారు.