పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు మండల కేంద్రంలోని యడ్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేసినట్లు ప్రధానోపాధ్యాయురాలు ఘంటశాల విజయభారతి తెలిపారు. 2024–25 విద్యాసంవత్సరంలో మార్చిలో రాసిన వార్షిక ఫలితాల్లో విఫలమైన విద్యార్థుల కోసం ఈ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 19 నుంచి 26 వరకు హైస్కూల్‌లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.