49 మద్యం సీసాలు స్వాధీనం - ముగ్గురు అరెస్టు

58చూసినవారు
49 మద్యం సీసాలు స్వాధీనం - ముగ్గురు అరెస్టు
అధిక ధరలకు విక్రయించుకునే ఉద్దేశంతో అక్రమంగా మద్యం నిల్వ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఇంకొల్లు ఎస్ఐ సురేష్ మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో అరెస్టు చేశారు. పక్కాగా అందిన సమాచారంతో ఆయన కొణికి రోడ్డు లోని లారీ యూనియన్ ఆఫీస్ వద్ద కాపు కాయగా మద్యం సీసాలను తెస్తున్న ముగ్గురు వ్యక్తులు దొరికారు. వారి నుండి 49 మద్యం సీసాలను ఎస్సై సురేష్ స్వాధీనపరచుకున్నారు. ముద్దాయిలను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్