90 మద్యం సీసాలు స్వాధీనం.. ఒకరు అరెస్ట్

73చూసినవారు
90 మద్యం సీసాలు స్వాధీనం.. ఒకరు అరెస్ట్
గాంధీ జయంతి సందర్భంగా వైన్ షాపులు మూతపడిన నేపథ్యంలో.. అధిక ధరలకు అమ్ముకునే ఉద్దేశంతో మద్యం సీసాలను అక్రమంగా నిల్వచేసిన వ్యక్తిని గొల్లపాలెంలో బుధవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు చీరాల వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. అతడి వద్ద నుండి 90 మద్యం సీసాలను స్వాధీనం పరుచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మద్యం బెల్టు దుకాణాలపై పూర్తి నిఘా పెట్టామని, నిరంతరం దాడులు చేస్తామని సీఐ చెప్పారు.

సంబంధిత పోస్ట్