నమూనా పరీక్షల ద్వారా తమ అభ్యసనాన్ని ఉద్యోగార్థులు మరింత మెరుగుపరుచుకొనవచ్చునని చీరాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ బాబు పేర్కొన్నారు. చీరాలలో గాంధీ జయం తి సందర్భంగా నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో.. పేరాల లోని ఆర్య వైశ్య కల్యాణ మండపంలో బుధవారం ఉచిత టెట్ నమూనా పరీక్ష నిర్వహించారు. దేశం కోసం పోరాడిన వారిని స్ఫూర్తిగా తీసుకొని ఉపాధ్యాయ వృత్తిలో మరింతగా రాణించాలని ఉద్యోగాలకు సూచించారు.