దిగమర్రు సమీపంలోని చీరాల- వేటపాలెం బైపాస్ రోడ్డులో సెయింట్ ఆన్స్ కాలేజీ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎదురెదురుగా వేగంగా వస్తున్న కారు, బైకు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైకు నడుపుతున్న వ్యక్తి తలకు తీవ్ర గాయమవ్వడంతో స్థానికులు 108 ఆంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా క్షతగాత్రుడిని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.